భారత్ జట్టులో గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు శుభమన్ గిల్. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20లో శతకం బాదిన ఈ యంగ్ క్రికెటర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అతనికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ డేటింగ్ యాప్ టిండర్‌లో కూడా ఖాతా తెరిచాడు.
శుభమన్ గిల్ ఈ టిండర్ యాప్‌లో అడుగు పెట్టడం వెనుక ఓ కథ ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టీ20లో శుభ్‌మన్ సెంచరీ సాధించడంతో స్టేడియంలో ఓ అమ్మాయి ‘టిండర్.. శుభ్‌మన్‌తో నన్ను కలుపు’ అని రిక్వెస్ట్ చేసింది. దాంతో.. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అదే అదనుగా ఆ ఫొటోని వాడుకుంటూ నాగ్‌పుర్‌లో టిండర్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసింది.శుభ్‌మన్ ఇక్కడ చూడు’ అనే హోర్డింగ్స్ అక్కడ దర్శనమివ్వడంతో.. ఆ ఫొటోలను భారత జట్టు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ట్విటర్‌లో పోస్టు చేసి గిల్‌ను ఆట పట్టించాడు.
‘మొత్తం నాగపూర్ చెబుతోంది. గిల్ ఓ సారి చూడు’ అంటూ ఉమేశ్ పోస్టు పెట్టాడు. ఈ ఫొటో కూడా వైరల్‌గా మారడంతో గిల్ ఎట్టకేలకి టిండర్‌లో చేరాడు. ‘నేను చూశా. ఇప్పుడు మీరు సరిగ్గా చూడండి.. టిండర్ కారణంగానే ఇందులో చేరా’ అని గిల్ ఓ వీడియో పోస్ట్ చేశాడు.