వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారులోకం సినిమాలో ఏక్కాడా అంటూ సందడి చేసిన నటి శ్వేతా బసు ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే.ఎంతో చబ్బీగా బొద్దుగా పొడువాటి జడతో ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్వేతా బసు ప్రసాద్ అనంతరం పలు సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాలేవి అనుకున్నంత స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయాయి.
ఇక ఈమె కెరియర్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన కెరీర్ లో ఏర్పడిన ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడి ఈమె బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.ఇలా తెలుగు తెరకు పూర్తిగా దూరమైన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ తన దృష్టి మొత్తం సినిమాల పైన పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి ఈమె తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.శ్వేతా బసు ప్రసాద్ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.అయితే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలలో శ్వేతా బసు ప్రసాద్ ని చూసినటువంటి నెటిజన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఎంతో బబ్లీగా ఉన్నటువంటి శ్వేతా బసు ప్రసాద్ ఇక్కడ అంటూ కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు గుర్తుపట్టలేనంతగా ఈమె మారిపోయిందని, తనకు ఏమైందంటూ నేటిజన్స్ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.