కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలో ఉండే పనిచేస్తున్నారు. గత ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటికీ ఇంకా అనేక మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆఫీసుకు చెందిన ఉద్యోగులు, బాస్‌లతో మాట్లాడేందుకు ఎక్కువగా జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లను వాడుతున్నారు. కానీ వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతాయి.
వీడియో కాన్ఫరెన్స్ లలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలను డీల్ చేయాల్సి వస్తే.. అప్పుడు డివైస్ మైక్‌ను ఆఫ్ చేయాలి. కెమెరా అయితే క్లోజ్ చేయాలి. లేదంటే మనం చేసేది, మాట్లాడేది అంతా పబ్లిక్‌కు వినిపిస్తుంది. దీంతో అనవసరంగా అభాసుపాలు కావల్సి వస్తుంది. ఓ ఉద్యోగినికి కూడా ఇలాగే జరిగింది. తన కొలీగ్స్‌తో ఆమె మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్‌లో ఉంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. అయితే అదే సమయంలో ఆమె తన డివైస్ మైక్‌ను ఆఫ్ చేయలేదు. దీంతో ఆమె తన స్నేహితురాలతో మాట్లాడిన కాల్ తాలూకు రికార్డింగ్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో శ్వేత (#Shweta) అనే హ్యాష్ ట్యాగ్ పేరిట ఆ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ కూడా అవుతోంది.
Big Boss: Our Show is number one reality tv show in India
Le Shweta: Watch my Zoom meeting#Shweta pic.twitter.com/yV0HeuFX2R
— Garv (ਗਰਵਿਤ) (@imgarvmalik) February 18, 2021
సదరు రికార్డింగ్‌లో ఓ యువతి తన స్నేహితురాలైన రాధిక అనే యువతికి తన రిలేషన్‌షిప్‌కు చెందిన వివరాలను తెలిపింది. అయితే అదే సమయంలో ఆమె మీటింగ్ లో కూడా ఉంది. కానీ మైక్‌ను ఆఫ్ చేయలేదు. దీంతో ఆమె మాట్లాడే మాటలు మీటింగ్‌లో రికార్డయ్యాయి. ఇక మీటింగ్‌లో ఉన్న ఆమె కొలీగ్స్ మైక్‌ను ఆఫ్ చేయమని పదే పదే చెప్పారు. కానీ ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆమె దాదాపుగా రెండున్నర నిమిషాల పాటు కాల్ మాట్లాడుతూనే ఉంది. దాన్ని ఎవరో రికార్డు చేసి బయట పెట్టారు. ఈ క్రమంలో ఆ రికార్డింగ్ వైరల్‌గా మారింది. దానికి అనేక మంది ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు.
#Shweta #Sweta
Sweta's classmates : turn off your micBut their inner feeling while listening to the conversation😂 pic.twitter.com/lmjOgF7nPE
— Neelambuj Singh (@NeelambujSingh) February 18, 2021
Can’t wait for Yashraj’s new song “#Shweta mic band krle “ 😅
— sanjam_dhanju (@DhanjuSanjam) February 18, 2021
#Shweta talking to radhika on conference call with 111 others
Meanwhile shweta's parents : pic.twitter.com/MaMwvYZLLh
— Fun तंत्र (@neophyte420) February 18, 2021
Pandit Boy :- I'm trusting you.
Plz don't tell anyone.Shweta on zoom call next day :-#Shweta pic.twitter.com/ATTz1YqbbB
— Harsh Sinha (@itsharshsinha) February 18, 2021