రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్యామ్ సింగ రాయ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.
ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది.
అలాగే ఇటీవలే ఈ చిత్రం ఓ టి టి లో కూడా రిలీజ్ అయింది.
ఇదిలా ఉండగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నాలుగో సీన్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నాని పోషించిన వాసుదేవ్ పాత్ర పై నడిచే సీన్ ఇది.
తాను తెలుగులో తీసిన ఉనికి చిత్రం సూపర్ హిట్ అయ్యిన తర్వాత తాను బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో మూడు సినిమాలు కాంట్రాక్టు ఎలా కుదుర్చుకున్నాడు, వారి షరతులు ఏంటి అనేవి ఈ సీన్ లో చూపించారు. ఇక నాని ప్రస్తుతం అంటే సుందరానికి, దసరా సినిమాలు చేస్తున్నాడు.