రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్యామ్ సింగ రాయ్. పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
అలాగే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో జనవరి 21న రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో టాప్ లో నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ రికార్డును కూడా బ్రేక్ చేసింది.
జనవరి 17 నుంచి 23 మధ్య శ్యామ్ సింగ రాయ్ సినిమాకు ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్ వచ్చాయి. అలాగే ట్రెండింగ్ విషయానికొస్తే నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ మూడవ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం నాని అంటే సుందరానికి, దసరా సినిమాలను చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదేలు దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా అంటే సుందరానికి సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది.