డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా శ్యామ్ సింగరాయ్ చిత్రం విడుదల కానుంది. అలాగే మూవీకి సంబంధించిన ట్రైలర్ మంగళవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది టీమ్. ఇప్పటికే ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ఆకట్టుకోగా.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. సాయి పల్లవి, నాని కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Let’s begin
Trailer Tomorrow ♥️
Christmas Maathram …… 🙂#ShyamSinghaRoy #SSRonDEC24th pic.twitter.com/DPxh1xereq— Nani (@NameisNani) December 13, 2021
Advertisements