రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం క్రమేణా విస్తరిస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నారు. కాగా తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నాని శ్యామ్ సింగ రాయ్ టీం పాల్గొంది.
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జిఎచ్ఎమ్ సి పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హీరో నాని,హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి,నిర్మాత బోయినపల్లి వెంకట్ పాల్గొన్నారు. ఇక రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 24 న రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.