దళిత యువకునిపై ఎస్.ఐ అక్రమంగా దాడి చేయటంతో ఆ యువకుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సూర్యాపేట జిల్లా మోతే ఎస్ రాయిపాడు గ్రామంకు చెందిన పరశురామ్ అనే యువకుడు సర్వారం గ్రామంలోని ఓ వివాహానికి హజరయ్యాడు. అక్కడ జరిగిన గొడవల్లో ఇతను లేకున్నా పాత కక్షలతో స్థానిక ప్రత్యర్థి వర్గం ఈ యువకున్ని ఇరికించి కేసులు పెట్టించారు.
దీంతో ఎస్.ఐ గోవర్ధన్ గొడవలకు సంబంధించి విచారిస్తూ దాడి చేశాడని యువకుని బంధువులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా డబ్బులకు లొంగి ఎస్.ఐ విచక్షణారహితంగా కొట్టాడని ఆరోపిస్తున్నారు.