గుంటూరు టాకీస్ తో మంచి హిట్ ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ తర్వాత సరైన హిట్ ను కొట్టలేకపోయాడు. కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమ ఓటిటి లో విడుదలై మంచి ఆదరణ పొందాయి. కానీ ఇప్పుడు థియేటర్లలో విడుదల అయిన డీజే టిల్లు మంచి విజయం సాధించింది.
ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ మేము మిమ్మల్ని నవ్వించడానికి కొన్ని కష్టమైన సమయాలను ఎదుర్కొన్నాము. ఈ విజయం కోసం 12 సంవత్సరాలు వేచి ఉన్నాను. గుంటూరు టాకీస్ 12 ఏళ్ల క్రితం విడుదలైంది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ, పెళ్లి చూపులు తర్వాత విజయ్ దేవరకొండ, క్షణం సినిమా తర్వాత అడివి శేష్‌కి వచ్చినంత బ్రేక్ నాకు రాలేదన్నారు.
నన్ను మీడియాలో ప్రమోట్ చేయమని నా స్నేహితుడిని అడిగాను. నేను ఆ రోజు ఒక విషయం నిర్ణయించుకున్నాను. మీ గురించి వ్రాయడానికి ఎవరైనా మీకు దొరకకపోతే, మీరు ఏమి చేస్తారు? మీరు వార్తగా మారండి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు.