గొప్ప అవకాశాలు అంటూ ఏవీ ఉండవు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అవి గొప్ప అవకాశాలుగా రూపుదిద్దుకుంటాయి. సినిమా రంగంలో సీదా వచ్చినవాళ్ళు ఎవరూ లేరు. వచ్చినా ఎక్కువ కాలం నిలబడిన దాఖలాలూ లేవు.! వారసత్వంతో వచ్చిన ఆ కాస్తమందీ కూడా పక్కాగా తర్ఫీదు తీసుకుని వచ్చినవాళ్ళే అయ్యుంటున్నారు.ప్రేక్షకులు పట్టం కట్టిన స్థాయిని నిలబెట్టుకోవాడానికి నిరంతరం కష్టబడుతున్న వాళ్ళే.
కొతండత నమ్మకం, కఠోర శ్రమనీ పెట్టుబడిగా పెట్టి ఏ బ్యాగ్రౌండు లేకుండా తెలుగుతెరను ఏలుతున్న నటీనటులున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు సాదా సీదా పాత్రలు వేసి ఇప్పుడు అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటున్న సినీతారల్ని,హీరోల్నీ చూద్దాం.
విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కానీ విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా నటించాడు. అర్జున్ రెడ్డి మూవీ ఇచ్చి ఒక్క ఛాన్స్ తో స్టార్ హీరో అయిపోయాడు.
సాయిపల్లివి
ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అంతేకాకుండా మలయాళం సినిమా ప్రేమమ్ తో అప్పటికే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అలాంటి సాయి పల్లవి విశాల్, మీరాజాస్మిన్ నటించిన పందెంకోడి సినిమాలో మీరాకు స్నేహితురాలిగా నటించింది.
త్రిష
వర్షం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన త్రిష. వర్షం కంటే ముందు జోడి సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలుగా నటించింది. ఫెయిర్ లుక్, ఫెర్ఫార్మెన్ తో అతి తక్కువ టైమ్ లో తెలుగు ,తమిళ చిత్రాల్లో దాదాపు స్టార్ హారోల సరసన సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం సినిమాలో మెయిన్ రోల్ చేసింది.
రవితేజ
స్టార్ హీరో రవితేజ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారట. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ ఫ్రెండ్స్ లో ఒకరిగా రవితేజ నటించాడు. అంతేకాకుండా బ్రహ్మాజీ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన సింధూరం సినిమాలో కూడా సెకండ్ హీరోగా చేశాడు.
కాజల్ అగర్వాల్
లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్. హిందీ సినిమా క్యూ హు గయానాలో ఐశ్వర్యరాయ్ కి స్నేహితురాలుగా నటించింది. హీరోయిన్ అటు నార్త్,ఇటు సౌత్ లోనూ ఎడాపెడా నటించేసింది.పెళ్ళిచేసుకుని స్టార్ డమ్ ని పాజ్ లో పెట్టి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది.
రీతువర్మ
పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ ntr హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన బాదుషా సినిమాలో కాజల్ చెల్లిగా నటించింది. పెళ్ళి చూపులు సినిమాతో తనకంటూ ఓ నేమ్, ఫేమ్ క్రియేట్ చేసుకుంది.
విజయ్ సేతుపతి
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా పరిచయం . పిజ్జా, నేను రౌడీ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి ఒకప్పుడు ధనుష్, కార్తీ, జయం రవిలాంటివాళ్ళు హీరోలుగా చేసిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించాడు. పిజ్జా అనే సినిమాతో హీరోగా దూసుకువచ్చాడు.
సత్యదేవ్
2011 లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చిన్న పాత్రలో చేశాడు సత్యదేవ్. సాఫ్ట్వేర్ ఇంజినీరైన సత్య… పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఫుల్ లెన్త్ తనదైన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కంప్లీట్ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు.
అనసూయ
అనసూయ అందరికీ జబర్దస్త్ అనే టీవీ షోకి యాంకరని మాత్రమే తెలుసు.ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందు ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో స్టూడెంట్ గా నటించింది .ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రంగమ్మత్తైకూర్చుంది.
అనసూయ అందరికీ జబర్దస్త్ అనే టీవీ షోకి యాంకరని మాత్రమే తెలుసు.ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందు ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో స్టూడెంట్ గా నటించింది .ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రంగమ్మత్తైకూర్చుంది.
Also Read: భానుమతి ఆ పాత్రలు చేయకపోవడం సావిత్రికి కలిసి వచ్చిందా…?