వేలమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే అన్నట్టుగా…సినిమా ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ లో చిన్నచిన్న పాత్రలు వేస్తూ ఒకానొక రోజున గొప్పగుర్తింపును సాధిస్తారు. ఇప్పటి వీరి స్థాయికి ఒక వారు నటించిన పాత్రలకు అసలు పొంతనే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ స్టార్లవ్వడం కష్టం..ఎవరో ఒకరిద్దరికి మాత్రమే అలాంటి అదృష్టం ఉంటుంది.
అలా వచ్చినా కూడా ఎంతోకాలం నిలవదు. కానీ ఒక్కో అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒక్కోమెట్టూ ఎక్కుతూ స్టార్లయిన వాళ్ళు ఉన్నారు.ఇప్పుడు మనం టాప్ యాక్టర్స్ గా అభిమానిస్తున్న వాళ్లల్లో కొందరు ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల్లో తళుక్కుమన్న వాళ్ళు కూడా ఉన్నారు.
విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారనుకుంటారు చాలామంది.. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా మూవీలో ,శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో విజయ్ నటించాడని…అంతేకాదు ఎవడే సుబ్రమ్మణ్యంలో నాని స్నేహితుడిగా నటించాడు విజయ్..
సాయిపల్లవి:
ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి…మళయాలం సినిమా ప్రేమమ్ తో అప్పటికే మార్కులు కొట్టేసింది సాయిపల్లవి..అందులో ముఖం నిండా మొటిమలతో కనిపించినప్పటికి సాయిపల్లవి నవ్వుకి, యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు.. అంతకుముందు ఢీ డ్యాన్సింగ్ షోలో కూడా పార్టిసిపేట్ చేసిన సాయిపల్లవి..
మీరాజాస్మిన్, విశాల్ జంటగా వచ్చిన “పందెం కోడి” సినిమాలో మీరాకి స్నేహితురాలిగా నటించింది.. తర్వాత ఎంబిబిఎస్ చదవడానికి ఆస్ట్రియా వెళ్లిపోయింది..భవిష్యత్ లో సినిమాలు లేకపోయినా డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్కుంటా అని ధీమాగా చెప్తుంది.
త్రిష:
వర్షం సినిమాతో తెలుగు వాళ్లకి పరిచయం అయిన త్రిష..రెండు దశాబ్దాలు దాటినా టాప్ హీరోయిన్ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుంది.. వర్షం కంటే ముందు జోడీ సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది.. ఫాల్గుని ఫాఠక్ ఆల్బమ్ సాంగ్లో ఆయేషా టకియాతో పాటు నటించింది.
రవితేజ:
మాస్ మహరాజా రవితేజ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు..అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూనే చిన్నచిన్న పాత్రలు పోషించాడు..అల్లరి ప్రియుడులో రాజశేఖర్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడిగా రవితేజని చూడొచ్చు..తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన రవితేజ, బ్రహ్మాజి హీరోగా క్రిష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “సింధూరం” సినిమాలో సెకండ్ హీరోగా నటించారు.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన “నీకోసం” సినిమా రవితేజ హీరోగా నటించిన మొదటి చిత్రం.
కాజల్:
హింది చిత్రం క్యూ హో గయా నా లో ఐశ్వర్యరాయ్ కి ఫ్రెండ్ గా నటించింది కాజల్..లక్ష్మీ కళ్యాణంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
రీతు వర్మ:
పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ..ఎన్టీయార్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమాలో కాజల్ కి చెల్లెలుగా, తనికెళ్లభరణి కూతురిగా నటించింది.
శర్వానంద్:
యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా పరిచయం అయిన శర్వానంద్..తర్వాత ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు.. సరైన హిట్ పడడానికి సుమారు పదేళ్లు పైనే పట్టింది శర్వానంద్ కి..
విజయ్ సేతుపతి:
తమిళ నటుడు విజయ్ సేతుపతికి తెలుగు వాళ్లల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువమందే ఉన్నారు..పిజ్జా,నేను రౌడి లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు..96 సినిమాతో విజయ్ సేతుపతికి సౌతిండియా మొత్తంలో ఫాలోయింగ్ పెరిగిపోయింది..ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న విజయ్ సేతుపతి ఒకప్పుడు ధనుష్, కార్తీ, జయం రవి ఇలా వీళ్లందరు హీరోలుగా చేసిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు.
నవీన్ పొలిశెట్టి:
గతేడాది రిలీజైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ పొలిశెట్టి. తర్వాత ‘జాతిరత్నాలు’ మూవీలో ఓ రేంజ్ గుర్తింపుని సంపాదించుకున్నారు నవీన్. అయితే మొదట్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో విజయ్ దేవరకొండ, నవీన్ ఇద్దరూ స్నేహితులుగా నటించారు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా చిచొరే లో కూడా నటించాడు నవీన్..యూట్యూబ్ ఓపెన్ చేస్తే నవీన్ వీడియోలకు ఎందరో ఫ్యాన్స్ ఉంటారు.. నవీన్ నెక్స్ట్ మూవీ జాతిరత్నాలు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సత్యదేవ్:
2011లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో చాలా చిన్న రోల్ పోషించాడు సత్యదేవ్.. అసలు ఆ సినిమాలో తను నటించాడని కూడా చాలా తక్కువ మందికి తెలుసు.. తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ, చిన్న సినిమాలకు హీరోలుగా చేస్తూ వచ్చాడు..ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.. సత్యదేవ్, నవీన్ పొలిశెట్టి లాంటి వాళ్లు నటులుగా ప్రూవ్ చేస్కున్నారు..కానీ ఇంకా సరైన హిట్ పడాల్సి ఉంది.
అనసూయ:
జబర్దస్త్ లో ఒక స్టార్ యాంకర్ గా ప్రూవ్ చేసుకున్న అనసూయ రంగస్థలం,పుష్ప1&2 లో అవకాశాలను అందిపుచ్చుకుని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డంతో బాటూ కెరీర్ కి బిగ్ లిఫ్ట్ ఇచ్చిన జబర్దస్త్ షోను కూడా పక్కనపెట్టే రేంజ్ కి ఎదిగింది అనసూయ.
Also Read: ఆ డైరెక్టర్ శిష్యులు అందరూ హిట్ లు కొడుతున్నారుగా…?