మల్లేశన్నా దావత్ లా.. బన్నూ గాని బారాత్ లా టిల్లు అన్న దిగిండంటే..డించక్ డించక్ దుంకాలా.. అనే పాటతో ప్రేక్షకులను విషేశంగా ఆకట్టుకున్న డీజే టిల్లు ఇప్పుడ మంచి సక్సెస్ ను అందుకుంది. గుంటూరు టాకీస్ ఫేమ్ జొన్నల గడ్డ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. మరీ ముఖ్యంగా సిద్దు కామెడీ టైమింగ్, రైటింగ్ టాలెంట్ తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిది. అయితే.. ఈ సినిమా తర్వాత సిద్ధు రెండు సినిమాలను తప్పుకుని డీజే టిల్లు పార్ట్ 2 పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే అందులో ఒక సినిమాలు టిల్లు నెగిటివ్ పాత్ర పోషిస్తుండగా.. మరోసినిమాలో ఆయన మేయిన్ రోల్ లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, డీజే టిల్లు 2 చేస్తున్న నేపథ్యంలో వీటి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం.. సిద్ధూ, అతని బృందం స్క్రిప్ట్ ను రెడీ చేశారని అంటున్నారు సన్నిహితులు. ఇది దాదాపు పూర్తి కావచ్చిందని చెప్తున్నారు. అంతేకాకుండా డీజే టిల్లు పార్ట్ 2లో కొత్త హీరోయిన్ పరిచయం కానుందని వినికిడి.