పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాల హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. సిద్దూను హత మార్చేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గత ఆరు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సిద్ధూ హత్య కోసం షార్ప్ షూటర్, వాంటెడ్ గ్యాంగ్ స్టర్ షారుక్ కు పెద్ద మొత్తంలో బిష్ణోయ్ గ్యాంగ్ సుపారీ ఇచ్చినట్టు వివరించారు. అయితే సిద్దూ వెంట ఎప్పుడూ భద్రతా సిబ్బంది ఉండటంతో ఆ పనిని షారుఖ్ పూర్తిచేయలేకపోయాడని పోలీసులు చెప్పారు.
ఇటీవల సిద్దూకు కేటాయించిన భద్రతను ఆప్ సర్కార్ తగ్గించిది. ఆప్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే సిద్దూను దుండగులు హత్య చేశారు. ప్రస్త్రుతం తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్, షారుక్ కల జతేది, కళా రాణాలను ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. మానస్ లో సిద్దూపై కాల్పులు జరిపిన కొద్ది సేపటికే దీనికి బాధ్యత వహిస్తు కెనడీయన్ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ తన ఫేసుబుక్ ఖాతాలో ఈ మేరకు పోస్టు పెట్టాడు.