ప్రముఖ సింగర్, పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సిద్దూ హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు.
సిద్దూ కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తో్ంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వారింగ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతల బృందం గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ను కలిసింది.
హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా కనీసం ఆప్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల్లో ఒక్కరు కూడా సిద్దూ కుటంబ సభ్యులను కలవలేదని, కనీసం వారికి అండగా నిలబడతామని ప్రకటన చేయలేదని ఆప్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆగ్రహం వ్యక్తం చేశారు.