శనివారం రిలీజ్ అయిన డీజే టిల్లు చిత్రం మంచి విజయం సాధించింది. యూత్ ని టార్గెట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా అదరగొడుతుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డను అయితే సినీ అభిమానులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
తెలంగాణ అసలైన హీరో ఎవరు అంటే ఇది వరకు విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ల పేర్లు చెప్పేవారు యూత్. కానీ ఇప్పుడు చాలా మంది సిద్ధు పేరు చెప్తున్నారు.
సిద్ధూలోని యాక్షన్ సౌలభ్యం మరెవరికీ లేవని, రాబోయే కాలంలో ఆయన మిగతా ఇద్దరు స్టార్‌ల కంటే సక్సెస్ అవుతాడని అంటున్నారు. తెలంగాణకు నిజమైన మెగాస్టార్‌గా సిద్దు నిలుస్తారని అంటున్నారు.
‘డీజే టిల్లు’ సినిమాలోని డైలాగులు, సన్నివేశాల క్రెడిట్ అంతా సిద్ధుదేనంటూ చెప్తున్నారు. మరి ఫ్యాన్స్ అనుకున్నట్టు సిద్దు కి ఈ చిత్రం కెరీర్ పరంగా పై స్థాయికి తీసుకెళ్తుందేమో చూడాలి.