వాట్సాప్ ప్రైవసీ పాలసీ మార్చక….చాలా మంది యూజర్లు తమ ఫోన్ లలో వాట్సాప్ లను డిలేట్ చేసి సిగ్నల్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనవరి 8 నుండి సిగ్నల్ యాప్స్ డౌన్ లోడ్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
డేటా కలెక్ట్:
వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ కారణంగా…యూజర్ఐడి, డివైస్ ఐడి, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ , కాంటాక్ట్స్ , అడ్వర్టైజింగ్ డేటా, పేమెంట్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించిన డేటాను కలెక్ట్ చేస్తుంది. సిగ్నల్ యాప్ కేవలం యూజర్ ఫోన్ నెంబర్ ను మాత్రమే కలెక్ట్ చేస్తుంది.
సెక్యూరిటీ :
వాట్సాప్ లాగా సిగ్నల్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. దీని ద్వారా డేటా ను థర్డ్ పార్టీ ట్రేస్ చెయ్యలేదు.
గ్రూప్స్ పరిస్థితేంటి?
సిగ్నల్ లో కూడా వాట్సాప్ మాదిరిగా గ్రూప్స్ ను క్రియేట్ చేసుకోవొచ్చు, కానీ వాట్సాప్ లో లాగా అందర్నీ ఒకేసారి జాయిన్ చేయడం కుదరదు….మొదట గ్రూప్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ గ్రూప్ లింక్ ను ఇతరులకు మెసేజ్ చేస్తే…వారికిష్టమైతేనే వారు ఆ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక గ్రూప్ లో 150 మంది మాత్రమే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది!