దేశంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. పౌరులందరికీ మంచి నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సదుపాయాలను అందించడంపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇది ఆరోగ్య రంగానికి సంబంధించిన వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలపాల్సిన రోజన్నారు.
వారి శ్రమ వల్లే మన మంతా ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్‌కు మన దేశం నిలయం కావడం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
పీఎం జన్ ఔషధి వంటి పథకాల లబ్ధిదారులతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.