కొత్త వేరియంట్ భయంలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బూస్టర్ డోస్‌పై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌లోనూ ఈ అంశంపై చర్చ నడుస్తోంది ఈక్రమంలో కొవిషీల్డ్‌ను బూస్టర్ డోస్‌గా వాడేందుకు అనుమతులు కోరింది సీరం. ఈమేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరింది.
భారత్‌లో సరిపడా కొవిషీల్ట్ నిల్వలు ఉన్నాయని డీసీజీఐకి వివరించింది సీరం. చాలా దేశాలు బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించాయని.. మన దేశంలోని పౌరులతో పాటు విదేశాల్లో కొవిషీల్డ్ తీసుకున్నవారంతా కావాలని అడుగుతున్నట్లు తెలిపింది.