గత ఏడాది అక్టోబర్ 2న, ఎన్సీబీ అధికారుల బృందం క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి, డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో షారుక్ కుమారుడు ఆర్యన్‌తో పాటు మరో 14 మందిని అరెస్టు చేశారు.
చివరకు, ఆర్యన్ ఖాన్‌ను దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఇదిలా ఉండగా ఓడపై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు తమ దాడిని కెమెరాలో రికార్డ్ చేయలేదు.
వారి నిబంధనల ప్రకారం దాడులను కెమెరాలో రికార్డ్ చేయడం తప్పనిసరి. కానీ ఆ సమయంలో ఎన్సీబీ అధికారులు రికార్డు చేయలేదు.
ఎన్సీబీ అధికారులు చేయకూడని ఈ స్టుపిడ్ మిస్టేక్ ఇప్పుడు ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసు నుంచి శాశ్వతంగా తప్పించనుంది. ఇది ఖచ్చితంగా షారుక్ కొడుకుకు పెద్ద ఉపశమనమనే చెప్పాలి.