తమిళ స్టార్ హీరో శింబు ప్రస్తుతం ఈశ్వరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ రెడ్డి దర్శకత్వంలో కూడా గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయనున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ సమయంలో 101 కేజీల నుంచి 71 పేజీల వరకు తగ్గిపోయాయి. తనలోని మార్పు తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొచ్చాడు.
అయితే తన కొడుకు గత కొన్ని నెలలుగా పడుతున్న కష్టం పై ఆయనకున్న అంకితభావంని చూసి మురిసిపోతూ బహుమతిని ఇచ్చారు శింబు తల్లి. తన డ్రీం కార్ ,బ్రిటిష్ రేసింగ్ కార్ మినీ కూపర్ బహుమతిగా ఇచ్చాడు. అయితే దీని ధర 50 లక్షలట. తల్లి ఇచ్చిన గిఫ్ట్ పట్ల శింబు కూడా సంతోషించాడు. ఇక ఇటీవల ఈశ్వరుడు సినిమాకు పనిచేసిన 400 మందికి ఒక గ్రామ్ బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు కూడా పెట్టారు.