వరుస ఫ్లాప్ లతో కొట్టుముట్టాడుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సరైన హిట్ లేక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా రాజ్‌తరుణ్ ఇప్పుడు రెండు సినిమాలను ట్రాక్ ఎక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందులో ఒకటి బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్‌గర్ల్’ తెలుగు లో రీమేక్ చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంతోష్ మోహన్ వీరంకి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఇదే విషయమై రాజ్ తరుణ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజ్ తరుణ్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటించబోతున్నారట. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఉండనుందని సమాచారం.