ఫైజర్ -బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఒక్కొక్కటిటా దేశాలు ఓకే చెప్తున్నాయి. ఇప్పటికే యూకే, యూఎస్, బహ్రెయిన్ వంటి దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా ఆ జాబితాలో సింగపూర్ కూడా చేరింది. ఫైజర్ టీకాకు ఆ దేశ ఆరోగ్యశాఖ అంగీకారి తెలిపింది. దీంతో ఈ టీకాను ఈనెల చివరలోగా పంపిణీ చేస్తామని సింగపూర్ ప్రధాని లీ హీషెన్ లూంగ్ ప్రకటించారు.
ఈనెలాఖరునాటి తొలి విడత టీకాలు వస్తాయని..వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సన్ వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు లీ హీషెన్ తెలిపారు. అలాగే ప్రజలందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగాచేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తొలుత తాను, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటారని తెలిపారు. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వయసుపైబడిన వారికి మొదట వ్యాక్సినేషన్ చేస్తామని వెల్లడించారు.