గుంటూరు: అమరావతి రాజధానితో సింగపూర్ అనుబంధం ముగిసిపోతుందా? సీడ్ కేపిటల్ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ఒప్పందం రద్దవుతుందా..? స్టార్టప్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక నిర్ణయమేదైనా త్వరలోనే వెలువడనుందా? అసలు అమరావతి భవితవ్యం ఏమిటి…? అమరావతిపై జగన్ సర్కార్ సమీక్ష తరువాత జరుగుతున్న చర్చలివి.
అమరావతి రాజధాని ప్రణాళికపై కొత్త ప్రభుత్వం నిర్ణయాలను అటు సింగపూర్ జాగ్రత్తగా గమనిస్తోంది. అమరావతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయాలనుకుంటోందని సింగపూర్ కన్సార్షియం తమకు తెలిపిందని, ఏపీ సర్కార్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సింగపూర్ ఆర్ధిక మంత్రి వీవీఎస్ బాలకృష్ణన్ తాజాగా ఓ సదస్సులో ప్రకటించారు. సమీక్ష చేసుకునే అధికారం రాష్ట్ర సర్కారుకు ఉందని, దాని ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని బాలకృష్ణన్ చెప్పారు. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రప్రసాద్ సింగపూర్ సదస్సులో వున్నప్పుడే వీవీఎన్ బాలకృష్ణన్ ఈ మాటలు అన్నారు.
ఇంతకూ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును ముందు సింగపూర్ వదులుకుంటుందా..? రాష్ట్ర ప్రభుత్వం వదిలించుకుంటుందా..? అనేది వేచి చూడాలి.