ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ సింగరేణికి తాకింది. ఆర్టీసీ డిపోల్లో సమ్మె కారణంగా బస్సులే కాదు… బస్సులకు మరమ్మత్తులు కూడా నిలిచిపోయాయి. చాలా చోట్ల బస్సులు మొరాయిస్తుండటంతో… ప్రభుత్వం సింగరేణి నుండి ఉద్యోగులను ఆర్టీసీకి బదలాయిస్తోంది. దీనిపై ఆర్టీసీ సంఘాలే కాదు… సింగరేణి కార్మిక సంఘాలూ మండిపడుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్చినం చెయ్యటానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. సింగరేణి సంస్థ తన కార్మికులను తప్పుదోవ పట్టించి, శ్రీరాంపూర్ ఏరియా ఆటో గారేజ్ లో ఉన్న కార్మికులను మంచిర్యాల డిపో కి బదిలీ చెయ్యటం ఏంటని మండిపడుతోంది. సింగరేణి కార్మికులను ఈ ప్రభుత్వం వాడుకున్నట్లు ఏ ప్రభుత్వం కూడా వాడుకోలేదని, ఇది ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ డిపోలకు బదిలీ చేసిన కార్మికులను వెంటనే వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. లేదంటే దీనిపై ఆందోళనలు మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నామని హెచ్చరించాయి సింగరేణి కార్మిక సంస్థలు.