ఆ ప్లేస్‌లో టచ్ చేశారు.. చెంప పగలకొట్టండి-చిన్మయి

లైంగిక వేధింపులకు గురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. ఆదివారం ఓ ప్రైవేటు ఈవెంట్‌కు హాజరైన ఆమెని, కొంతమంది ఆకతాయిలు గుంపుగా వచ్చారని, అందులో ఓ వ్యక్తి తనను చేతులతో తడిమేందుకు ప్రయత్నించాడని తెలిపింది. తాకరాని చోట తాకాడంటూ తనపై జరిగిన వేధింపులను బయటపెట్టింది. ఈ వేధింపుల విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసినప్పుడు తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వేధింపులకు గురైన విషయాన్ని తెలుసుకుని షాకయ్యానని తెలిపింది.

Child sexual abuse, stalking and victim blaming.

Posted by Chinmayi Sripada on Monday, March 12, 2018

ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదని, వెంటనే వాళ్ల చెంప చెల్లుమనిపించాలని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. ఈ విషయం గురించి పేరెంట్స్‌కి చెబితే.. చదువు, ఉద్యోగాన్ని మాన్పించి ఇంట్లోనే వుంచుతారేమోనన్న భయంతో అమ్మాయిలు వెనుకాడుతున్నారని, ఇలాంటి సందర్భంలో వాళ్లకు అండగా నిలవాలన్నారు. మిమ్మల్ని ఎవరైనా తాకాలని ప్రయత్నిస్తే వెంటనే వాళ్ల చెంప పగలగొట్టాలంటూ పిలుపునిచ్చింది చిన్మయి.