తన డ్యాన్స్, డైలాగ్ లతో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఏదైనా చుస్తే ఇట్టే నేర్చుకోలగడు అని ఎన్టీఆర్ ను ప్రశంసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పై సింగర్ గీతా మాధురి భర్త నందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సవారి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రభస సినిమా షూటింగ్ సందర్బంగా చోటుచేసుకున్న సందర్భాన్ని నందు గుర్తు చేశాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కమిట్ మెంట్ చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు.
ఈ సినిమాని పాట కోసం రెండున్నర నిమిషాల డ్యాన్స్ చేయాల్సి ఉంది. డ్యాన్స్ మాస్టర్స్ వచ్చారు. రెండున్నర గంటలపాటు ఆపాటకు డ్యాన్స్ ను ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో అక్కడ ఎన్టీఆర్ అన్న లేడు. తరువాత హీరోగారిని పిలవండి అనగానే తారక్ అన్న వచ్చాడు. ఓసారి వేసిన డ్యాన్స్ ను చూసి.. మరోసారి డ్యాన్స్ చేయమని తారక్ అన్న కోరగా.. మళ్ళీ డ్యాన్స్ చేశారు. ఇక అంతే.. టేక్ రెడీ అనగానే వెళ్లి రెండు నిమిషాల్లోనే అచ్చం అలాగే స్టెప్పులేశాడని తారక్‌పై ప్రశంసలు కురిపించాడు. గీతామాధురి కూడా నందు వ్యాఖ్యలకు సంబదించిన పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.