మ్యూజిక్ రియాల్టీ షో లో ఆ సింగర్ ఏం చేశాడు ?

అస్సామీ సింగర్ అంగరాగ్ పపన్ మహంత (ఇతడ్నే పపన్ అని కూడా వ్యవహరిస్తారట) ఓ మ్యూజిక్ రియాల్టీ షో లో అనుచితంగా ప్రవర్తించి వివాదం కొనితెచ్చుకున్నాడు. ఈ షో లో ఇతగాడు ఓ జూనియర్ కంటెస్టెంట్ కి కిస్ ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తన ఫేస్ బుక్ పేజ్ లో పపన్ ఈ వీడియోను పోస్ట్ చేసి తన ” ఘన కార్యాన్ని ” చాటుకున్నాడు. ది వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్ సీజన్-2 లో జ్యూరీ మెంబర్ గా పాల్గొన్న పపన్.. మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు అసభ్యంగా ఉందంటూ సుప్రీంకోర్టు లాయర్ రూనా భుయాన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు లేఖ రాశారు.

ఇది మైనర్లపై లైంగిక దాడిలాంటిదేనని, ఇతని చర్య చాలా హేయమైనది, ఖండించదగినదని ఆమె పేర్కొన్నారు. పపన్ పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు.

https://youtu.be/Fy8F1puIDc0