ఆర్ కెల్లీ… పూర్తి పేరు రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ. అమెరికన్ సింగర్. ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై, ఇగ్నీషన్ లాంటి పాటలతో బాగా ఫేమస్ అయ్యాడు. సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు. అయితే.. ఇతను మ్యూజికల్ పరంగా ఎంత పాపులరో.. నేరాపణల్లోనూ అంతే.
కెల్లీ స్టార్ డమ్ ముసుగులో కెరీర్ లో సాయం చేస్తానని ఎంతోమందిని నమ్మించి లోబరుచుకున్నాడు. మీ టూ ఉద్యమం సమయంలో ఇతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. చాలామంది యువతులు ఇతడిపై ఎన్నో ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే కెల్లీ పంచాయితీలు కోర్టుకు చేరాయి. న్యూయార్క్ కోర్టు గతేడాదే ఇతన్ని దోషిగా నిర్ధారించింది. కానీ.. తీర్పు వెలువరించలేదు. తాజాగా శిక్ష ఖరారు చేసింది.
మహిళల్ని మోసం చేసిన కేసుల్లో కెల్లీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జడ్జి ఆన్ డోన్నెల్లీ బ్రూక్లిన్ ఈ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా ఈస్టర్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ లోని యూఎస్ అటార్నరీ కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. అయితే.. ఈ కేసులో మళ్లీ అప్పీల్ చేయనున్నట్లు అతని తరఫు లాయర్లు తెలిపారు.