బిగ్ బాస్ సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసింది. హౌస్ లో వీరిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ నడిచిందని పెద్ద ప్రచారమే సాగింది. బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగ్ కూడా అప్పుడప్పడూ వీరి మధ్య ఎదో నడుస్తుందంటూ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేవారు. పున్ను బేబీ ఎలిమినేషన్ సమయంలో రాహుల్ వెక్కి వెక్కి ఏడ్చటంతో ఈ ఊహాగానాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి మూడో సీజన్ విజయవంతం కావడానికి వీరి లవ్ కెమిస్ట్రీ కూడా ఓ కారణమని వార్తలొచ్చాయి. అయితే బయటకొచ్చాక వీరిద్దరూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్నలే వారికీ ఎదురు అవుతున్నాయి.
ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. బిగ్ బాస్ క్రేజ్ తో రాహుల్ కెరీర్ మూడు పూలు ఆరుకాయలు అనేంతలా మారిపోయింది. అటు సింగర్ గా అవకాశాలు అందిపుచ్చుకుంటూనే నటుడిగా ఛాన్స్ ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఈ సినిమా యూనిట్ నటీనటులకు రాహుల్ ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొంది. ఈ పార్టీలో పున్ను బేబీ, రాహుల్ పాట పాడుతూ సందడి చేశారు. అయితే తాజాగా రాహుల్ పునర్నవి కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Advertisements
బిగ్ బాస్ విజేతగా గెలిపించిన అభిమానుల కోసం, పునర్నవి కోసం తామిద్దరం ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని ప్రకటించారు. ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్ ను కలిసినట్టు రాహుల్ తెలిపాడు.