మరో నాలుగు రోజుల్లో బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ షో కు సంబంధించి ప్రోమోలు విడుదలవుతున్నాయి. కాగా ఈసారి సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ లు ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొన్ని పేర్లు చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత పేరు కూడా వినిపించింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది సునీత. నా ప్రియమైన మిత్రులారా నేను బిగ్ బాస్ ఫోర్ తెలుగు లో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటూ తన పేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు సునీత. ఇక ఇటీవల సునీతకు కరోనా పాజిటివ్ రాగ ఆమె క్షేమంగా బయటపడ్డారు.