సింగర్ సునీత. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన పాటతో జనాన్ని మైమరిపించే సునీత… ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. తను ఎందుకు మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇద్దరు పిల్లలు తన పెళ్లిపై ఏమన్నారు వంటి అంశాలపై ఓ ఆంగ్ల మీడియాతో షేర్ చేసుకున్నారు.
తనను చాలా సంవత్సరాలుగా మళ్లీ పెళ్లి చేసుకోవాలని తల్లితండ్రులు కోరుతూనే ఉన్నా… పిల్లల కోసం ఒప్పుకోలేదన్నారు. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవారైపోయారని, వారికి అన్నీ అర్థం చేసుకునే స్థాయి వచ్చేసిందన్నారు. తనకు రామ్ చాలా కాలంగా తెలుసని, తన సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకునే వారని… క్రమంగా ఆ పరిచయం స్నేహంగా మారిందన్నారు. చివరకు తను రామ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తన పిల్లలకు చెప్పగానే ఇద్దరు గట్టిగా హాగ్ చేసుకొని సంతోషపడ్డారన్నారు.
ఇటు తన తల్లితండ్రులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రతి మనిషికి ఉండే బాధలను జీవిత సహచరితో పంచుకుంటారని… కలిసి నడవటం ముఖ్యమన్నారు. అయితే, తాము సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నామని… కరోనా కారణఃగా ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. రిసెప్షన్ కూడా లేదని, అయితే… చిన్న చిన్న పార్టీల ద్వారా అందర్నీ కలుస్తామన్నారు. అవన్నీ అయిపోయాకే హానీమూన్ ప్లాన్ చేసుకోబోతున్నట్లు వివరించారు.