తెలుగులోనే కాదు ఎన్నో భారతీయ భాషల్లో తన మధురమైన గొంతుతో అభిమానులను అలరించిన సింగర్ సునీత. కేవలం పాటలతోనే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో తన గొంతు వినిపించారు. అయితే, చాలా కాలం క్రితమే తన భర్తకు విడాకులిచ్చిన సునీత… ఒంటరిగానే ఉంటుంది.
గత కొంతకాలంగా సునీత రెండో పెళ్లిపై ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేస్తూ రాగా… ఇటీవల ఓ యూట్యూబ్ మీడియా అధిపతి, మ్యాంగో మీడియా అధినేత రామ్ తో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా… సునీత అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.