భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69వేల 921 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. మరో 819 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షల 91 వేల 167కు చేరింది. ఇందులో 28 లక్షల 39 వేల 883 మంది కరోనా నుంచి కోలుకోగా.. మరో 7 లక్షల 85 వేలకుపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య
65 వేల 288కి పెరిగింది.
కరోనా వైరస్ కేసుల్లో ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే ఇండియా 2.37 లక్షల కేసులు తక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో రోజూ బ్రెజిల్ కంటే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో కేసుల పరంగా ఇండియా ప్రపంచంలో రెండోస్థానానికి చేరే అవకాశముంది.