ధనుష్ హీరోగా నటించిన తొలి తెలుగు సినిమా సర్. వెంకీ అట్లూరి దర్శకుడు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. థియేట్రికల్ ట్రైలర్రి లీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే, ఓ సామాజిక సందేశంతో సినిమా తెరకెక్కిన విషయం అర్థమౌతోంది. కథ, కథనం ఆసక్తికరంగా ఉన్నాయి. సందేశంతో పాటు.. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉన్నట్టున్నాయి.
విద్య అనేది లాభాపేక్ష లేని సేవ అని చెప్పే విద్యావేత్తతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మెరుగైన విద్యను అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రభుత్వ కళాశాలలను దత్తత తీసుకుంటామని ఆయన ప్రకటిస్తాడు. గ్రామీణ విద్యా కార్యక్రమానికి వాలంటీర్‌గా ఎంపికైన లెక్చరర్స్ లో ధనుష్ ఒకడు. అదే సమయంలో, తన సహోద్యోగితో ధనుష్ లవ్ లో పడతాడు.
సముద్రఖనిని విలన్ గా చూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, కార్పొరేట్ విద్యా వ్యవస్థను పరిచయం చేయడమే అతని అసలు లక్ష్యం అని తెలుస్తుంది. దీన్ని ధనుష్ ఎలా అడ్డుకున్నాడో ట్రైలర్ లో చూపించారు. ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. సంయుక్తా మీనన్ తన పాత్రలో ఆకట్టుకుంది. ఈనెల 17న థియేటర్లలోకి వస్తున్నాడు సర్.