తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానలు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను కలిసి భరోసా కల్పించాలి. కానీ.. ఎక్కడా వారి జాడ కనిపించడం లేదు. ఎటుచూసినా పోలీసులే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
సిరిసిల్ల వరద నీటిలో నానుతోంది. భారీ వర్షాలకు పట్టణం పూర్తిగా వరదలో మునిగిపోయింది. రోడ్లను చేస్తుంటే.. వాగులను తలపిస్తున్నాయి. కాలనీలన్నీ నీటమునిగాయి. ఇంట్లో నుండి అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. అయితే ఓ గర్భిణీ వరద నీటిలో చిక్కుకుపోయింది. పోలీసులు ఆమెను జేసీబీ ద్వారా కాపాడి.. ఆసుపత్రికి తరలించారు.