సిరిసిల్ల: తెలంగాణలో మొట్టమొదటిసారిగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. పోలీస్ అధికారులందరితో కలిసి జిల్లా ప్రజలతో ముఖాముఖీ కానున్నారు. జిల్లాలో ఎవరికైనా చట్టపరమైన సమస్యలు ఉన్నా, ఏవైనా కేసులలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా స్వయంగా ఈ మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తనతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఆరోజు జిల్లా పోలీసు ఉన్నతాధికారులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.