రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. పదుల సంఖ్యలో లారీలు అక్రమంగా హైదరాబాద్ తరలిపోతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో సాగుతున్న ఈ ఇసుక్ర అక్రమ దందాపై ఎన్నో విమర్శలు వచ్చినా, నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
తాజాగా సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సర్పంచ్ సిద్ధం శ్రీనుకు చెందిన ఇసుక లారీలు అక్రమంగా హైదరాబాద్ తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గన్నేరువర మండల ఎస్.ఐ చొక్కారావు పల్లె సర్పంచ్, ఉప సర్పంచ్ లు నిలదీయటంతో తమ అనుచరులతో కలిసి వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు జరుగుతుండటంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.