టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలు ఆనమ్‌మీర్జాతో అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ ప్రేమలో పడ్డాడు. హాయ్‌తో మొదలైన పరిచయం పరిణయం దాకా వచ్చింది. తొలుత క్రికెటర్ అయిన అసద్. టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలు ఆనమ్‌మీర్జాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఆనమ్ వెంటనే యాక్సెప్ట్ చేసింది. ఇక పెళ్ళికి ఇద్దరూ రెడీ. అసదుద్దీన్ కీప్‌క్వైట్, ఆనమ్‌మీర్జా హైపర్. డిసెంబర్‌లో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఈ మేరకు అసద్ ప్రకటన కూడా చేసేశాడు.
ఆనమ్ మీర్జాకు 2016లో అక్బర్ రషీద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్లపాటు సాగిన సంసారం 2018లో విడాకులకు దారితీసింది. మొదట నుంచి అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆనమ్ మీర్జా, అసదుద్దీన్‌లు మంచి మిత్రులుగా మారారు. కొన్నాళ్ల తర్వాత ప్రేమ చిగురించింది.
ఆనమ్, అసద్ ప్రేమలో ఉన్నప్పటి నుంచే వీరి వివాహం కోసం అజారుద్దీన్, సానియా మీర్జాలు సన్నాహాలు ప్రారంభించారు. ఇరు కుటుంబాల వారు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చాక పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న డిసెంబర్‌లో హైదరాబాద్ సిటీలోనే షాదీ జరగనుంది. పెళ్లికి ఇప్పటి నుంచే షాపింగ్ ప్రారంభించారు.