దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ల పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు పట్టం కట్టారు.
ఇక మృణాల్ సీతగా చేసిన పర్ఫార్మెన్స్‌కు అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా అదిరిపోయే విజయాన్ని అందుకోవడంతో మృణాల్ ఒక్కసారిగా అందరి హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. సీతా రామం తరువాత మృణాల్ చాలా సమయం తీసుకుని తన నెక్ట్స్ మూవీని నేచురల్ స్టార్ నానితో కలిసి చేసేందుకు రెడీ అయ్యింది. నాని కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న మూవీలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక ఈ సినిమాతో పాటు పలు ఇతర సినిమాల దర్శకనిర్మాతలు సైతం మృణాల్‌ను తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కేవలం తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల సినిమా డైరెక్టర్స్ కూడా మృణాల్‌ను తమ సినిమాల్లో తీసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇందులో ముఖ్యంగా తమిళ, మలయాళ దర్శకనిర్మాతలు మృణాల్ డేట్స్ కోసం ఆమె చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
అయితే, తనకు కథ, సినిమాలో ఆమె పాత్ర నచ్చితేనే సినిమాలు చేసేందుకు మృణాల్ ప్రాధాన్యతను ఇస్తోందట. మరి తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండస్ట్రీలపై కన్నేసిన మృణాల్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే వార్తలు వస్తుండటంతో, ఈ వార్తలో ఖచ్చితంగా నిజం ఉందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.