ప్రముఖ నటుడు మహేష్ బాబు కూతరు సితార గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో సితార పాపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
తాజాగా సితార బంపర్ ఆఫర్ కొట్టేసింది. చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యుయలరీ షాపుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. పీఎంజే జ్యుయలరీ షాపుకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సైన్ కూడా చేసింది సితార.
ఒకే లొకేషన్ లో మూడు రోజుల పాటు షూటింగ్ లో కూడా సితార పాల్గొంది. పేరొందిన టెక్నీషియన్లు ఇందులో భాగం అయ్యారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో సితారతో రూపొందించిన ప్రకటన మనకు టీవీల్లో కనిపించనుంది.
ఇప్పటికే యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా డబ్బు సంపాదిస్తున్న సితార పాప.. ఇప్పుడు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చిన్న ఏజ్ లోనే డబ్బు సంపాదిస్తోంది. ఈ డీల్ తో చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయ అని సితార మరోసారి నిరూపించుకుంది.