దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా సీతారామం. వైజయంతీ మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్ పై వస్తోంది ఈ చిత్రం. దుల్కర్ కు టాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేదు. అలా అని వైజయంతీ బ్యానర్ ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో సీతారామం సినిమా తెలుగులో ఎలా బిజినెస్ చేసిందనే విషయం తెలుసుకోవడం ఎవరికైనా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. ఆ వివరాలు మీకోసం..
సీతారామం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. ఒక్క నైజాంలోనే ఈ సినిమా 4 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రాలో 6 కోట్ల రేషియోలో అమ్మారు. ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 12 కోట్ల రూపాయల వసూళ్లు రావాల్సి ఉంటుంది.
అయితే ప్రీ-రిలీజ్ బిజినెస్ డీసెంట్ గానే జరిగినప్పటికీ, బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది అందరి అనుమానం. ఎందుకంటే, మరో సినిమా బింబిసార పోటీగా నిలిచింది. ఎక్కువ థియేటర్లను అదే ఎగరేసుకుపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు కేవలం 350 థియేటర్లు మాత్రమే దక్కాయి. అటు బింబిసారకు 685 థియేటర్లు దక్కాయి.
ఇలా తక్కువ థియేటర్లలో విడుదలవుతున్న సీతారామం సినిమా 12 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రిలీజైన మొదటి వీకెండ్ ఈ సినిమా రిజల్ట్ పై క్లారిటీ వస్తుంది.