సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కళావతి అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ స్టెప్స్ కీర్తి అందాలు ,సిద్ శ్రీరామ్ వాయిస్ అన్ని కూడా హైలెట్ గా నిలిచాయి.
కాగా తాజాగా ఈ పాటకు డాన్స్ చేసింది మహేష్ బాబు కూతురు సితార. ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు మహేష్ బాబు.
ఇక మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది.