ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. బాంబుల శబ్దాలతో ఉక్రెయిన్ నగరాలు దద్దరిల్లి పోతున్నాయి.
దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ శ్మశాన వాటికను తలిపిస్తోంది. ప్రధాన నగరాల్లో ఎటు చూసినా శిథిలాలు, చెల్లా చెదురైన మృత దేహాలు కనిపిస్తున్నాయి. పలు నగరాల్లోని వీధులన్నీ ఉక్రెయిన్- రష్యా సైన్యాల భీకర పోరుకు వేదికగా మారుతున్నాయి.
కేవలం 6 రోజుల్లో 6000 మంది రష్యన్ సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ లెక్కన ఉక్రెయిన్ సైనికులు, ఆ దేశ పౌరులు కలిపితే ఆ సంఖ్య ఎంత ఉంటుందో తలుచుకుంటే వణుకుపుడుతుంది.
ఇక చాలా మంది బంకర్లలో తలదాచుకున్నారు. మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియక ప్రజలు గజగజ వణికి పోతున్నారు. అందుకే ఎప్పుడు ఏ శబ్దం వినపడినా గజగజ వణికి పోతున్నారు. కనీసం ఆహారం తెచ్చుకోవడానికి కూడా బయటకు తొంగి చూడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.