నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తత నెలకొంది. శివాజీ విగ్రహం విషయంలో హిందువులు, ముస్లింల మధ్య వివాదం చెలరేగింది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై మైనారిటీ నాయకులు అభ్యంతరం చెబుతూ విగ్రహం దగ్గరే బైఠాయించారు. దాన్ని తొలగించాలనే డిమాండ్ తో ఆందోళనకు దిగారు.
ఇరు వర్గాల నాయకులు, స్థానిక ప్రజలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతలోనే రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో చేసేది లేక లాఠీలకు పని చెప్పారు పోలీసులు.
ఇరు వర్గాలు వెళ్లకుండా అలాగే నినాదాలు చేస్తుండడంతో చివరకు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కమిషనర్ ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు.
బోధన్‌లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. నిరసనలు నిలిపివేయాలని ఇరు వర్గాలకు గంట సమయం ఇచ్చినా వారు వినలేదని రాళ్లు రువ్వుకోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించామని తెలిపారు.
ఈ వివాదంపై బీజేపీ ఎంపీ అరవింద్ స్పందించారు. మున్సిపల్ తీర్మానంతో బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవాలని, ధ్వంసం చేయాలని ఎంఐఎం, టీఆర్‌ఎస్ గూండాలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రతీ బీజేపీ కార్యకర్త అడ్డుకోవాలన్నారు. ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ కృపాకటాక్షాల కోసం ఎదురు చూస్తున్న సీపీ నాగరాజ్ బోధన్ కౌన్సిల్ లో ఎన్నడో ఒప్పుకొన్న విగ్రహ స్థాపనని ఆపమని ఎట్లా చెప్తారని ప్రశ్నించారు.
How dare TRS MLA & followers demand for idol of Tippu sultan, the mass murderer of Hindus, beside our National hero #ShivajiMaharaj’s idol ?!
Nizamabad CP Nagaraj ji has to quit intimidating @BJP4India karyakartas into stopping the idol’s unveiling & disperse the TRS-MIM goons! pic.twitter.com/ctJm6S2ohV
— Arvind Dharmapuri (@Arvindharmapuri) March 20, 2022
Advertisements