బెంగళూరు: చంద్రయాన్ -2 ఆఖరి నిమిషంలో ఏర్పడిన లోపంతో అంతదూరంలో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో ఛైర్మన్ శివన్‌ను హత్తుకొని ఓదార్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో శివన్‌తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలంతా ఖిన్నులయ్యారు. తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ఆవేదన చెందిన ఇస్రో ఛైర్మన్ శివన్‌తోపాటు శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ భుజం, వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాన్ని టీవీలు ప్రత్యక్షప్రసారం చేయడంతో దేశ ప్రజలందరినీ ఆకర్షించింది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » శివన్ కన్నీళ్లు..