ఒడిశాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలోని బిదుచక్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బొగ్గుతో నిండిన ట్రక్ వేగంగా వచ్చి బస్ ను ఢీకొట్టింది. దీంతో బస్ బోల్తా పడింది. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉడాలా నుంచి భువనేశ్వర్ కు వెళ్తోంది బస్.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. గ్రామస్తుల సాయంతో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్ నుజ్జునుజ్జయింది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు పోలీసులు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.