పారిపోవాలన్న వారి లక్ష్యం ముందు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది. ది షాశంక్ రిడంప్షన్ అనే ఓ హాలీవుడ్ మూవీ సీన్..ఇజ్రాయెల్ లో రిపీట్ అయింది. హాలీవుడ్ సినిమా రేంజ్ లో జరిగిన ఈ గ్రేట్ ఎస్కేప్ లో..జైలులో జస్ట్ స్పూన్ తో సొరంగం తవ్వి ఆరుగురు ఉగ్రవాదులు పారిపోయారు. అవును నిజమే..కేవలం తుప్పు పట్టిన స్పూన్ తోనే సొరంగం తవ్వారు.
తమ సెల్ లోని వాష్ రూమ్ ఏరియాలో కొన్ని నెలల పాటు ఎవరికీ కనీసం అనుమానం రాకుండా తవ్వుతూ పోయారు. ఆ సొరంగం నేరుగా జైలు గోడ అవతలికి వుండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ టాస్క్ పూర్తి కాగానే ఓ శుభముహూర్తంలో ఎంచక్కా చెక్కేశారు. కాకపోతే వీళ్లు పారిపోయేది సీసీ కెమెరాల వల్లో, సెక్యూరిటీ వల్లో తెలియలేదు. జైలు బయటికొచ్చాక ఖైదీలు అక్కడి పొలాల గుండా పారిపోతుంటే గమనించిన రైతులు అధికారులకు సమాచారమిచ్చారు. అంతే..బిత్తరపోయిన పోలీసులు అలర్ట్ జారీ చేసి, గాలింపు చర్య లు చేపట్టారు.పరారీలో ఉన్నవారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగిలిన ఐదుగురు గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ కు చెందినవారు.
అటు,ఈ విషయం తెలిసి గాజాలోని ఇస్లామిక్ జిహాద్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆరుగురు మిలిటెంట్ల వీరోచిత ఆపరేషన్ సక్సెస్ అయిందని మిఠాయిలు పంచిపెట్టారు.ప్రపంచంలోనే ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ చాలా కట్టుదిట్టమైందని పేరు.అలాంటి వ్యవస్థకే ఢోకా ఇచ్చారంటే ఆ ఖైదీలు ఇంకెంత ముదుర్లో తెలుస్తోంది.