శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో చరణ్‌ని కలెక్టర్‌గా కనిపించబోతున్నారు.
ఇక తమిళ నటుడు ఎస్‌జే సూర్య ప్రధాన విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్, శ్రీకాంత్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఇప్పుడు ఎస్‌జే సూర్య పేరు తెరపైకి రావటం ఆసక్తి నెలకొంది.
గతంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటించాడు. అలాగే శింబు నటించిన తమిళ హిట్ మానాడులో కూడా ఎస్‌జే సూర్య బ్యాడ్ పోలీసుగా కనిపించాడు.
ఇక చరణ్ సరసన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.