1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న 282 మంది భారత సైనికుల అస్తిపంజరాలను అధికారులు వెలికి తీశారు. పంజాబ్ లోని అమృత్ సర్ ప్రాంతంలో తవ్వకాలు జరపుతుండగా ఈ అస్తిపంజరాలు బయటపడ్డట్టు అధికారులు వెల్లడించారు.
పంజాబ్ వర్సిటీ అంత్రోపాలజీ విభాగం అసిస్టెంబ్ ప్రొఫెసర్ డాక్టర్. షెరావత్ మాట్లాడుతూ… ‘ ఈ అస్తిపంజరాలన్నీ 1857 తిరుగుబాటులో పాల్గొని బ్రిటీష్ వారి చేతిలో మరణించిన సైనికులవి’ అని తెలిపారు.
వాటిని అమృత్ సర్ లోని అజ్నాల సమీపంలో ఓ ఆలయం కింద కనుగొన్న ఓ బావిలో నుంచి వెలికి తీసినట్టు చెప్పారు. వీరంతా ఆవు, పంది మాంసం పూసిన తూటాలను వినియోగానికి వ్యతిరేకంగా బ్రిటీష్ వారితో పోరాడినట్టు అధ్యయనంలో తేలిందన్నారు.
ఆ స్థలంలో నాణేలు, మెడల్స్ లభించాయన్నారు. వాటిపై పరిశోధనలు చేసినట్టు తెలిపారు. ఆస్థిపంజరాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి, రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియను నిర్వహించగా అన్నింటిలో ఇదే విషయం తేలిందన్నారు.