అది చూడటానికి మాములు ఇంటిలాగే కనిపించినా దానికొక ప్రత్యేక ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్లు భారత్‌లో భోజనం చేసి మయన్మార్‌లో నిద్రపోతుంటారు. ఇలా రోజుకు చాలా సార్లు వాళ్లు సరిహద్దులు దాటుతుంటారు. ఎందుకంటే వారని కిచెన్ భారత్‌లో ఉండగా బెడ్ రూం మయన్మార్‌లో ఉంది.
వింటుంటేనే ఆసక్తిగా అనిపిస్తోంది కదూ.. మరి ఆ ఇంటి గురించి తెలుసుకుందామా…. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి…. నాగాలాండ్‌లోని మోన్‌జిల్లాలో ఉన్న పెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. ఇది రాజధాని కోహిమాకు 380కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ గ్రామం భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ గ్రామంలో కొన్యాక్ తెగకు చెందిన వారు అధికంగా ఉంటారు. అంగ్ అనే వ్యక్తి ఆ తెగ వారికి అధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఆంగ్ ఉండే ఇల్లు భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది.
ఆయన ఉండే ఇంట్లోని కిచెన్ మయన్మార్‌లో ఉంటే, బెడ్‌రూమ్ మాత్రం భారత్‌లో ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఆకలైతే ఓ దేశానికి, నిద్ర వస్తే మరో దేశానికి వెళ్తారు అని కామెంట్స్ చేస్తున్నారు.